Tue Dec 24 2024 12:52:50 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్తుల వివాదాన్ని విజయమ్మే పరిష్కరించాలి : బాలినేని
వైఎస్ కుటుంబాన్ని చీల్చాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు లేదని బాలినేని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
వైఎస్ కుటుంబాన్ని చీల్చాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఆ కుటుంబాన్ని వాళ్లే చీల్చుకుంటున్నారన్నారు. వైఎస్ కుటుంబ సమస్యను విజయమ్మే పరిష్కరించాల్సి ఉంటుందని బాలినేని శ్రీనివాసులు రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ రచ్చ వైఎస్ అభిమానులను బాధిస్తుందని తెలిపారు.
బురద జల్లడం...
వైఎస్ మరణంపై బురదజల్లడం మంచిది కాదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. విజయమ్మ సూచనల ప్రకారమే.. జగన్, షర్మిల నడుచుకోవాలని కోరారు. అంతేతప్ప ఆస్తుల పంచుకోవడంపై రచ్చ చేసుకుంటే రాజకీయంగా ఇద్దరికీ నష్టమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బాలినేని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
Next Story