Fri Dec 20 2024 01:06:44 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మాజీ మంత్రి బండారు అరెస్ట్
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లాలోని ఆయన నివాసంలో బండారు సత్యనారాయణమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. భారీ బందోబస్తు నడుమ బండారు సత్యనారాయణమూర్తిని గుంటూరుకు తరలిస్తున్నారని తెలిసింది.
రెండు కేసులు...
ఆయనను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో బండారుపై కేసు నమోదు కావడంతో అక్కడి నుంచి పోలీసులు అనకాపల్లికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు మంత్రి రోజాను దూషించన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. బండారు సత్యనారాయణమూర్తిపై రెండు కేసులు నమోదు చేశారు. నిన్న రాత్రి నుంచే ఆయన ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. దాదాపు రెండు వందల మంది పోలీసులు చేరుకుని ఆయనకు 41 ఎ నోటీసులు జారీ చేశారు.
Next Story