Thu Dec 19 2024 12:14:04 GMT+0000 (Coordinated Universal Time)
ధైర్యముంటే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించండి : బొత్స
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తిరుమలలో పాటు అన్ని ఆలయాల్లో ప్రసాదాలు కల్తీ చేశారంటూ గందరగోళం సృష్టిస్తున్నారంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
నోటీసులు ఇచ్చి...
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని అంటున్న చంద్రబాబు.. ఎలా కల్తీ జరిగిందో తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు. తిరుమలకు రావొద్దని నోటీసులు ఇస్తారు.. మళ్లీ ఎవరు వెళ్లొద్దన్నారని వాళ్లే అంటారని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూ వివాదం కేసును ధైర్యముంటే సీబీఐకి అప్పగించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
Next Story