Thu Dec 26 2024 18:55:29 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ జకియా ఖానమ్ వైసీపీ కాదు
ఎమ్మెల్సీ జకియా ఖానంకు వైసీపీతో సంబంధం లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు
ఎమ్మెల్సీ జకియా ఖానంకు వైసీపీతో సంబంధం లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆమె టీడీపీలో చేరారని బొత్స తెలిపారు. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ల వివాదంలో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖాన్ అని ప్రచారం చేయడం ఏమాత్రం తగదని బొత్స సత్యనారాయణ తెలిపారు.
పార్టీని వీడారని...
ఆయన మీడియాతో మాట్లాడుతూ జకియా ఖానం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తమ పార్టీ నుంచి వెళ్లిపోయారన్నారు. ఆమె టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్నారు. తాము జకియా ఖానంను తమ పార్టీగా పరిగణించడం లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనిని గుర్తుంచుకుని మీడియా వైసీపీ ఎమ్మెల్సీ అని ప్రచారం చేయవద్దని కోరారు.
Next Story