Mon Dec 23 2024 08:44:11 GMT+0000 (Coordinated Universal Time)
వృద్ధులను మండుటెండలో రమ్మంటారా?
పింఛన్దారులను మండుటెండలో రమ్మంటారా అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు.
పింఛన్దారులను మండుటెండలో రమ్మంటారా అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. వృద్ధులు ముప్ఫయి నాలుగు లక్షలమందిని సచివాలయాలకు రమ్మంటారా అని నిలదీశారు. మంచాలపై వృద్ధులను ఎండలో ఊరేగిస్తూ టీడీపీపై విషప్రచారం చేస్తున్నారన్నారు ఓట్ల కక్కుర్తితో వైసీపీ నేతలు, అధికారులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారా అని నిలదీశారు.
టీడీపీపై విషప్రచారం...
తొమ్మిది మంది అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నా.. ఇంకా మార్పు రాదా? అని దేవినేని ఉమ అన్నారు. అస్మదీయులకు ఖజానా దోచిపెట్టడం వల్లే పించన్ డబ్బు జమకాలేదన్న దేవినేని ఉమ సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి, ధనుంజయరెడ్డి తీసుకున్న నిర్ణయాలపై చీఫ్ సెక్రటరీ వెంటనే స్పందించాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
Next Story