Fri Dec 20 2024 17:30:39 GMT+0000 (Coordinated Universal Time)
సన్న బియ్యం ఇవ్వలేని సన్నాసీ.. కొడాలి నానిపై దేవినేని ఫైర్
మంత్రి కొడాలి నాని పై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు
మంత్రి కొడాలి నాని పై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. కొడాలి నానిపై అభ్యంతరకరరీతిలో పదజాలం వాడారు. బూతుల మంత్రితో కృష్ణా జిల్లా పరువు తీస్తున్నాడని దేవినేని ఉమ అన్నారు. చంద్రబాబు రాజకీయంగా బిక్ష పెడితే ఈ స్థాయికి వచ్చావన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కొడాలి నానికి జిల్లాల గురించి, ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సీఎం బూట్లు నాకే వ్యక్తి అని దేవినేని ఉమ అన్నారు.
ఆంబోతులాగా....
అచ్చోసిన ఆంబోతులాగా వచ్చి పొట్టకోస్తే అక్షరం రాని వ్యక్తి కొడాలి నాని అని దేవినేని ఉమ అన్నారు. కొడాలి నాని మాట్లాడే భాషకు బయటప్రాంతంలో పశువులా చూస్తున్నారన్నారు. సన్నబియ్యం ఇవ్వలేని సన్నాసివి నీకు ఎందుకురా? రాజకీయం అని అన్నారు. కేసులు పెడితే భయపడతామనుకున్నావా? అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? చంద్రబాబు వయసెంత? నీ వయసెంత? అని దేవినేని ఉమ కొడాలి నానిపై ఫైర్ అయ్యారు.
Next Story