Mon Dec 23 2024 00:58:09 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై తిరుగుబాటు తప్పదు
మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనభై మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనభై మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. జగన్ నియంతృత్వ పోకడలను సహించలేక వారు తిరుగుబాటు చేయనున్నారని దేవినేని ఉమ అన్నారు. సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటుకు సిద్ధమవుతుంటే ఆయన కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఏం పీకుతారని దేవినేని ఉమ ప్రశ్నించారరు. అమరావతి మహాపాదయాత్ర జరుగుతున్న నందివాడ మండలంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు.
గుడివాడలో సూపర్ సక్సెస్....
పోలీసులను ఉపయోగించి గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్రను అడ్డుకోవాలని చూశారని, అయినా విజయవంతమయిందన్నారు. బూతుల మంత్రి చివరకు ఏమీ చేయలేక పాదయాత్ర జరుగుతున్న సమయంలో స్ట్రీట్ లైట్ లను ఆపివేయించారని దేవినేని ఉమ ఆరోపించారు. జగన్ గ్యాంగ్ విశాఖలో ఏ భూమిని వదిలిపెట్టడం లేదని, చివరకు రుషికొండను కూడా మింగే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు.
Next Story