Mon Dec 23 2024 02:57:47 GMT+0000 (Coordinated Universal Time)
కాపులే భవిష్యత్ లో రాజకీయాలను శాసిస్తారు
రాబోయే రోజుల్లో కాపు సామాజికవర్గమే రాజకీయాలను శాసిస్తుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు
రాబోయే రోజుల్లో కాపు సామాజికవర్గమే రాజకీయాలను శాసిస్తుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ లో రాబోయే రోజుల్లో కాపులు ఏకమవ్వాలని వారు పిలుపునిచ్చారు. వివిధ పార్టీల్లో ఉన్న కాపు సామాజికవర్గం నేతలందరూ ఒకచోట సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
కాపు నేతలను....
కాపు వర్గాన్ని ప్రోత్సహించిన వారినే అధికారంలోకి తేవాలని వైసీపీ నేత తోట త్రిమూర్తులు అన్నారు. ఇదే సభలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ వంగవీటి రంగాను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఏపీలో రెండు లక్షల విగ్రహాలు రంగాకే ఉన్నాయన్నారు. అంబేద్కర్ తర్వాత రంగా విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయన్నారు.
Next Story