Mon Nov 25 2024 16:35:15 GMT+0000 (Coordinated Universal Time)
కుతూహలమ్మ కన్నుమూత
మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ మరణించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మాజీ మంత్రిగా పనిచేశారు.
మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ మరణించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మాజీ మంత్రిగా పనిచేశారు. ఈ రోజు ఉదయం తిరుపతిలోని స్వగహం లో మరణించారు. వృతరీత్యా డాక్టర్ అయిన కుతూహలమ్మ1978 లో చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పని చేశారు. అప్పటి నుంచి కుతూహలమ్మ రాజకీయంగా ఎదిగారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1985,1989,1999, 2004 ఎన్నికలలో వేపంజేరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా విజయం సాధించారు.
మాజీ మంత్రిగా...
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆమె గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. 2009లోనూ ఆమె కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కుతూహలమ్మ కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఆమె తన కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలని భావించారు. కానీ ఆ కోరిక తీరకుండానే మరణించారు. నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి హయాంలో ఆమె వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో వైఎస్ హయాంలో శాసనసభలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. కుతూహలమ్మ మృతి పట్ల టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.
Next Story