Wed Dec 18 2024 22:03:24 GMT+0000 (Coordinated Universal Time)
Jogi Ramesh : జోగి రమేష్ నేడు మరోసారి పోలీసుల ఎదుటకు
మాజీ మంత్రి జోగి రమేష్ నేడు మరోసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు
మాజీ మంత్రి జోగి రమేష్ నేడు మరోసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో ఆయనకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు రావాలని ఆయన కోరారు. రెండు రోజుల క్రితం ఇదే కేసులో తన న్యాయవాదితో కలసి విచారణకు హాజరయ్యారు.
మొబైల్స్ ను తీసుకు రావాలని...
ఈరోజు మరోసారి విచారణకు రావాలని చెప్పడంతో మధ్యాహ్నం రెండు గంటలకు హాజరవుతానని చెప్పారు. విచారణకు వచ్చే సమయంలో ఇప్పుడు వినియోగిస్తున్న మొబైల్ తో పాటు దాడి సమయంలో వినియోగించిన మొబైల్ ను తీసుకురావాలని పోలీసులు తెలపడంతో ఆయన ఈరోజు విచారణకు వాటితో హాజరు కావాల్సి ఉంది.
Next Story