Sat Dec 21 2024 12:42:31 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. కారులో వచ్చిన యువకులు రాళ్లతో దాడికి దిగారు.
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన ఇంటి వద్దకు కారులో వచ్చిన యువకులు రాళ్లతో దాడికి దిగారు. అక్కడ కాపలాగా ఉన్న పోలీసులు ఆ యువకులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కారులో తమతో పాటు తెచ్చుకున్న రాళ్లతోనే దాడికి దిగడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
గత ప్రభుత్వ హయాంలో...
గత ప్రభుత్వం హయాంలో జోగి రమేష్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడికి వెళ్లిన నేపథ్యంలో అందుకు ప్రతిగానే ఈదాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే రాళ్ల దాడి చేసిన యువకులు వెంటనే అదే కారులో వెళ్లిపోయారు. ఫలితాల అనంతరం ఘర్షణలు జరుగుతాయన్న సమాచారంతో పాటు నిఘా వర్గాల సూచనల మేరకు కొందరు వైసీపీ నేతల ఇళ్లవద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story