Mon Dec 23 2024 10:41:41 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసుల అదుపులో మాజీ మంత్రి కాల్వ
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను పోలీసులు అడ్డుకున్నారు
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కాల్వను అడ్డుకున్నారు. బొమ్మనహల్ మండలం ఉంతకల్లుకు వెళుతుండగా పోలీసులు కాల్వ శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు. పెద్దయెత్తున టీడీపీ శ్రేణులు ఆయన వెంట వస్తుండగా పోలీసులు అభ్యంతరం చెప్పారు. కణేకల్ పోలీసుల వ్యవహరించిన తీరుతో మైనారిటీకి చెందిన కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.
మైనారిటీ కుటుంబాన్ని...
అయితే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. వెళ్లడానికి వీలు లేదని అభ్యంతరం తెలిపారు. దీంతో టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయినా పోలీసులు కాల్వ శ్రీనివాసులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకు దిగిన టీడీపీ వర్గాలను చెదరగొట్టారు. చివరకు కాల్వ శ్రీనివాసులును మాత్రం అనుమతించారు.
Next Story