Mon Dec 23 2024 04:52:59 GMT+0000 (Coordinated Universal Time)
Kanna : జగన్ పై కన్నా... ఆ పార్టీకి అభ్యర్థులే దొరకరంటూ
జగన్ కు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులే దొరకరని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు
జగన్ కు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులే దొరకరని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జగన్ దురహంకారంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులే దొరకరు ఆయన తనకు, తనపార్టీకి ఎదురైన పరాభవం భరించలేక జగన్ రాష్ట్రం విడిచి పారిపోతారని అన్నారు. బ్రిటీష్ వారిని ఆదర్శంగా తీసుకున్న జగన్ రెడ్డి ప్రజలిచ్చిన అధికారంతో రాష్ట్రాన్ని దోచేసి, దేశంలోనే గొప్ప ధనవంతుడిని కావాలన్న తన కోరికను నెరవేర్చుకోవడం కోసం ఐదేళ్లు దుర్మార్గపు పాలన సాగించారన్నారు. జగన్ రెడ్డి విచ్చలవిడి దోపిడీ, అధికారం తలకెక్కిన అహంకారంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే పక్కచూపులు చూస్తున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీకి అభ్యర్థులు దొరక్క పార్టీ మూసేసి జగన్ రాష్ట్రం విడిచి పారిపోతారని కన్నా లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు.
ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి...
2019 ఎన్నికల్లో గెలవడంకోసం జగన్ రెడ్డి అబద్ధాలు, మోసపు హామీలతో ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని నమ్మించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక బ్రిటీష్ వారి కంటే దారుణంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారన్న కన్నా, ప్రజలు, రాష్ట్ర సంపదను ఏకీకృతం చేసి మొత్తం తానే దోచుకోవాలన్న దురాశతో వెంపర్లాడుతున్నారననారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భారతదేశంలోనే తానే గొప్ప ధనవంతుడిని కావాలని జగన్ రెడ్డి భావించేవారని, తనకలను నిజం చేసుకోవడం కోసం ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో దోపిడీయే లక్ష్యంగా తన దుర్మార్గపు, విధ్వంస పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బాటలోనే ఆయన పార్టీనేతలు కూడా తమకున్న మార్గాల్లో ఎక్కడికక్కడ దొరికింది దోచుకోవడం ప్రారంభించారన్నారు.
Next Story