Fri Dec 20 2024 07:33:35 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు కొడాలి స్ట్రాంగ్ కౌంటర్
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. దేశంలో అత్యంత పిరికి నేత చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. పోలవరం కోసం తమ పార్టీ ఎంపీలను రాజీనామా చేయాలని చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క ఎమ్మెల్యేతోనైనా రాజీనామా చేయించారా? అని ప్రశ్నించారు. ఎన్నికలంటే చంద్రబాబుకు భయం పట్టుకుంటుందని అన్నారు. చంద్రబాబుకు నిజంగా ధైర్యముంటే తన పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు.
ఏ ఒక్కరి చేతనైనా....
చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించలేదన్నారు కొడాలి నాని. ఎమ్మెల్యేలను పక్కన పెడితే సర్పంచ్ చేత కూడా రాజీనామా చేయించే ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు అని నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఉచిత సలహాలు తమకు అవసరం లేదని అన్నారు. అవతలి వాడికి చెప్పే ముందు తాను పాటించాలన్నారు. చంద్రబాబు అంత పిరికి నేత మరొకరు ఉండరన్నారు. తాము ఎలా సాధించుకుంటామో తమకు తెలుసునని అన్నారు.
Next Story