Sat Apr 12 2025 21:18:04 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : కొడాలి నాని ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు
మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలో కొద్దిసేపటి క్రితం నామినేషన్ వేశారు

మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలో కొద్దిసేపటి క్రితం నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా గుడివాడ పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేయడం వినిపంచింది.
డబ్బుల కోసమే...
చంద్రబాబు సీట్లను ఎన్ఆర్ఐలకు అమ్ముకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. డబ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్లు ఇచ్చారని ఆయన అన్నారు. ఎన్ఆర్ఐలు ఎన్నికల సమయంలో వచ్చి మళ్లీ ఎన్నికలు అయిపోగానే వెళ్లిపోతారన్నారు. వాళ్లకు ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. చంద్రబాబును నమ్ముకున్న వాళ్లు ఎవరూ బాగుపడలేదన్నారు.
Next Story