Thu Dec 19 2024 11:49:57 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : పనికిమాలినోళ్లందరికీ బ్లాక్ క్యాట్ కమాండోలా? జగన్ కు ఎందుకు ఇవ్వరు?
జగన్ పై దాడి ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
![kodali nani, ycp, chandrababu, tdp kodali nani, ycp, chandrababu, tdp](https://www.telugupost.com/h-upload/2023/05/28/1506067-kodali-nani.webp)
జగన్ పై దాడి ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రేరణతోనే జగన్ పై ఈ దాడి జరిగిందన్నారు. పనికిమాలినోళ్లందరికీ బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత కల్పిస్తున్నారని, ప్రజలకు మంచి చేసే నేత జగన్ కు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక అనేక మంది శత్రువులున్నారని, అందుకే కేంద్ర బలగాలతో ప్రత్యేక రక్షణ కల్పించాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.
చంద్రబాబు పిలుపు మేరకే...
ముఖ్యమంత్రి జగన్ పై దాడి వెనక అనేక మంది పెద్దలున్నారని అన్నారు. తుళ్లూరులో నిన్న మధ్యాహ్నం చంద్రబాబు జగన్ తో రాళ్లకొట్టాలని పిలుపునిచ్చారని, ఆ తర్వాత ఈ ఘటన జరిగిందని అన్నారు. పచ్చ దండు కులన్మోదంతో ముదిరిపోయిన పిచ్చి పరాకాష్టకు ఎక్కించుకున్న ఉన్మాదులు ఈ దాడికి పాల్పడ్డారన్నారు. పకడ్బందీ పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నారు. దాడి చేసిన వారిపైన, దాడి వెనక ఉన్న వారిపై కూడా కఠినంగా శిక్షించాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. గురి చూసి గన్ తోనే కొట్టారని అన్నారు.
Next Story