Wed Apr 16 2025 01:51:34 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై కొడాలి నాని ఏమన్నారంటే?
వైఎస్ జగన్ టిక్కెట్ నిరాకరించిన వాళ్లంతా టీడీపీ, జనసేనలోకి వెళుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు

వైఎస్ జగన్ టిక్కెట్ నిరాకరించిన వాళ్లంతా టీడీపీ, జనసేనలోకి వెళుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన గుడివాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. రాజమండ్రి జైలుకి రా కదలిరా అని న్యాయస్థానం చెప్పిందని ఎద్దేవా చేశారు. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా తమను ఏం చేయలేరని కొడాలి నాని అన్నారు.
బదిలీ చేసింది చంద్రబాబు కాదా?
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలిగించినంత మాత్రాన ఆయనకు వచ్చే నష్టమేమీ లేదని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు చంద్రగిరి నుంచి నారావారిపల్లికి ట్రాన్స్ఫర్ అయిన విషయం మరిచిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. ఏ పార్టీ అయినా లీడర్లందరికీ టిక్కెట్లు ఇస్తుందా? అని నిలదీశారు. చంద్రబాబువి సొల్లుమాటలు.. 420 మాటలు అంటూ కొట్టిపారేశారు. గద్దె రామ్మోహన్ ను గన్నవరం నుంచి విజయవాడ తూర్పుకు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రాజమండ్రి టౌన్ నుంచి రూరల్కు మార్చింది చంద్రబాబు కాదా అని అన్నారు.
Next Story