Sun Nov 17 2024 18:27:58 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మకూరులో చంద్రబాబు రోడ్డు మీదే నిద్రపోయారు
నిమ్మకూరులో చివరకు చంద్రబాబు బస్సులో నిద్ర చేయాల్సి వచ్చిందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.
నిమ్మకూరులో చివరకు చంద్రబాబు బస్సులో నిద్ర చేయాల్సి వచ్చిందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కనీసం ఎన్టీఆర్ బంధువులు కూడా చంద్రబాబు రాత్రి బస చేయడానికి ఇల్లు ఇవ్వలేదన్నారు. అంత నీచమైన బతుకు చంద్రబాబుది అని కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు జిత్తుల మారి నక్క అని అన్నారు. 42 ఏళ్ల తర్వాత అత్తగారు ఊరైన నిమ్మకూరు వెళ్లి బస చేసినా ఎవరూ రాత్రి బస ఏర్పాట్లు చేయలేదన్నారు. గుడివాడలో 23 వేల మందికి ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. చంద్రబాబు గుడివాడకు ఏం చేశారో చెప్పాలన్నారు.
జూనియర్ ఒక్కరే...
చంద్రబాబు సభల్లో ఖాళీ కుర్చీలు కనిపించాయన్నారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు కూడా చంద్రబాబు పెట్టలేక పోయారన్నారు. ఆ ఊరిమీద కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ప్రేమ ఉందని, నిమ్మకూరులో ఎన్టీఆర్ వారసులుగా చెప్పుకుంటున్న వారికి ఎవరికీ ఇల్లు కూడా లేదన్నారు. అన్నీ ఆస్తులు అమ్ముకుని పోయారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు గుర్తుగా 25 ఎకరాల స్థలం కొన్నారని తెలిపారు. గుడివాడలో ప్రచారం చేసిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయిందని కొడాలి నాని అన్నారు. తాము పెట్టిన విగ్రహాలకు చంద్రబాబు నివాళులర్పించాల్సి వచ్చిందన్నారు. అంబేద్కర్ జయంతి రోజు ఇలాంటి నీచుడి గురించి మాట్లాడి రావాల్సి రావడం దురదృష్టకరమని కొడాలి నాని అన్నారు.
Next Story