Fri Dec 20 2024 06:41:35 GMT+0000 (Coordinated Universal Time)
దమ్ముంటే నాపై పోటీ చెయ్.. బాబుకు నాని సవాల్
దమ్ముంటే చంద్రబాబు తనపై పోటీ చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు
దమ్ముంటే చంద్రబాబు తనపై పోటీ చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. వైసీపీ గుడివాడ మినీ ప్లీనరీ సమావేశంలో కొడాలి నాని ఈ సవాల్ విసిరారు. చంద్రబాబుకు సిగ్గూ శరం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం మంచి చేస్తుంటే 420 గాళ్లు వెనక నుంచి గోతులు తవ్వుతున్నారని కొడాలి నాని ఫైర్ అయ్యారు. జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని, వారికి పదవులు ఇస్తున్నారని కొడాలి నాని అన్నారు.
టీడీపీ అధికారంలో ఉంటే...
అదే జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి టీడీపీ అధికారంలో ఉంటే బీసీలకు వచ్చి ఉండేదా? అని కొడాలి నాని ప్రశ్నించారు. గుడివాడలో ఏదో చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, బాబు తండ్రి కర్జూరనాయుడు వల్ల కూడా కాదని కొడాలి నాని అన్నారు. ఎవరినో నిలబెట్టేదెందుకు? తనపై చంద్రబాబు పోటీ చేసి గెలవాలని కొడాలి నాని సవాల్ విసిరారు. జగన్ ను ఓడించడం ఎవరి వల్లా కాదన్నారు. జగన్ పేదల పక్షపాతి అని నాని అన్నారు.
Next Story