Fri Dec 20 2024 07:22:14 GMT+0000 (Coordinated Universal Time)
ముసుగులు తీసి తిరగండి... కొడాలి ఫైర్
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి కూడా ఓడిపోతారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి కూడా ఓడిపోతారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలి వీస్తుందన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీని జగన్ నేలమట్టం చేస్తారని అన్నారు. కుప్పం వెళ్లి చంద్రబాబు అడుక్కుంటున్నాడని అన్నారు. కుప్పంలో ఎన్ని ఫీట్లు చేసినా చంద్రబాబుకు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఒక్కటై ఎన్నికలకు వస్తాయని కూడా కొడాలి నాని అన్నారు. చంద్రబాబు భయపడే కుప్పం పరిగెత్తి అల్లర్లు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
టైం వచ్చినప్పుడు...
నిజంగా చంద్రబాబుకు భయం లేకపోతే కుప్పానికి అన్ని సార్లు ఎందుకు వెళతాడని ఆయన ప్రశ్నించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సరైన సమయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటాడని తాను భావిస్తున్నానని చెప్పారు. ఎవరో కోరితే ఆయన రాజకీయాల్లోకి రారని, ఆయన వచ్చే టైం వస్తే వచ్చి తీరుతాడని కొడాలి నాని తెలిపారు. టీడీపీ, జనసేన ముసుగులు తీసి తిరిగితే మంచి కొడాలి నాని సూచించారు.
Next Story