Mon Dec 23 2024 07:24:35 GMT+0000 (Coordinated Universal Time)
రెచ్చగొట్టేలా రైతుల యాత్ర .. కొడాలి నాని ఫైర్
రైతుల మహాపాదయాత్ర రెచ్చగొట్టే విధంగా కొనసాగుతుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు
రైతుల మహాపాదయాత్ర రెచ్చగొట్టే విధంగా కొనసాగుతుందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రోజుకు పదిహేను కిలోమీటర్లు నడుస్తూ రాష్ట్రమంతా మెలికలు తిరుగుతూ వెళుతున్నారన్నారు. వెనకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని పరిపాలన రాజధాని చేయాలని చూస్తుంటే అడ్డుపడుతున్నారన్నారు. రైతుల ముసుగులో కృత్రిమ ఉద్యమం నడుపుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. 32 రోజులు 130 కిలోమీటర్లు ప్రయాణించారన్నారు. జగన్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ పాదయాత్ర చేస్తున్నారన్నారు. విశాఖ ప్రాంతలో రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. రుషికొండలో నిర్మాణం చేసేది ప్రభుత్వ కార్యాలయాలని, దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
కొండలను తవ్వి...
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో కొండలను తొలచి ఇళ్లు కట్టుకోలేదా? చంద్రబాబు ఇల్లు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలు కడుతుంటే అందులో అవినీత ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించారు. పవన్ నాటకాలను ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారని కొడాలి నాని అన్నారు. వచ్చే ఎన్నికల్ల చంద్రబాబుకు మరోసారి సమాధి కట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. పవన్ టీడీపీకి అవసరమొచ్చినప్పుడల్లా ఒక పనిముట్టుగా ఉపయోగపడుతున్నారన్నారు. రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ ను కూడా తిట్టిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు మోచేత నీళ్లను తాగేవాళ్ల చేత నన్ను కూడా తిట్టిస్తున్నారన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర స్పాన్సర్డ్ కార్యక్రమం అని అన్నారు.
Next Story