Fri Dec 20 2024 12:15:27 GMT+0000 (Coordinated Universal Time)
మా మేనల్లుడి ఐడీతోనే జాయిన్ అయ్యా
విద్యార్థులతో లోకేష్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.
విద్యార్థులతో లోకేష్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. టెన్త్ తప్పిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తమను చూడటానికే లోకేష్ కట్ చేశారని కొడాలి నాని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో రాజకీయం చేస్తున్నారన్నారు. జూమ్ మీటింగ్ ఎందుకు పెట్టారని, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులతోనే మాట్లాడానికి వచ్చారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. తాను దొంగతనంగా జూమ్ మీటింగ్ లోకి రాలేదన్నారు.
చిల్లర రాజకీయాలు....
తాము ఫేక్ ఐడీలతో లాగిన్ అవ్వలేదన్నారు. తమ మేనల్లుడు ఐడీతోనే లాగిన్ అయ్యానని, విద్యార్థి తరుపున మాత్రమే తాను హాజరయ్యానని చెప్పారు. పిల్లల మెదళ్లో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో పాఠశాలలు మూయించాలని గొడవ చేసిందెవరో చెప్పాలని కొడాలి నాని నిలదీశారు. ఆరోజు స్కూళ్లు కరోనాతో మూసివేయాలని గొడవ చేశారని, వారికి క్లాస్ లు ఎక్కడ జరిగాయని ప్రశ్నించారు. మరో రెండు నెలలు సమయం ఇచ్చి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు జరుపుతామని, అందులో చదువుకుని పాస్ కావాలని కొడాలి నాని కోరారు. వారి జీవితాలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
Next Story