Fri Dec 20 2024 07:17:38 GMT+0000 (Coordinated Universal Time)
ఫేక్ పార్టీ.. ఫేక్ వీడియోలు.. కొడాలి ఫైర్
టీడీపీ ఒక ఫేక్ పార్టీ అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. టీడీపీకి ఫేక్ వీడియోలు, ఫేక్ సర్టిఫికేట్లు కొత్తేమీ కాదన్నారు
తెలుగుదేశం ఒక ఫేక్ పార్టీ అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. టీడీపీకి ఫేక్ వీడియోలు, ఫేక్ సర్టిఫికేట్లు కొత్తేమీ కాదని అన్నారు. చంద్రబాబు ఒక గలీజు నేత అని, అమ్మాయిలను ఎరవేయడానికి కూడా వెనుకాడడని కొడాలి నాని అన్నారు. ఎడిట్ చేసిన వీడియోను ఫోన్ లో రికార్డు చేస్తే ఒరిజినల్ ఎలా అవుతుందని కొడాలి నాని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఆడియోను అమెరికాకు ఎందుకు పంపలేదన్నారు. ప్రజాసమస్యలపై పోరాడకుండా నిత్యం నలుగురు కలసి కుట్రలు పన్నుతున్నారని కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా దానిని జగన్ కు ఆపాదించడం వీరికి అలవాటుగా మారిపోయందన్నారు.
వీడియోను ఎడిట్ చేసి...
ఎంపీ మాధవ్ వీడియోను తము అమెరికాలో ఉన్న ల్యాబ్ కు పంపామని అంటున్నారని, అది ఒరిజినల్ గా వాళ్లు తేల్చారని విమర్శలు చేస్తున్నారన్నారు. ఫేక్ వీడియోలు సృష్టించడం టీడీపీకి కొత్తేమీ కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు రావడం కోసం చంద్రబాబు ఎవరిని ఎక్కడకు పంపించారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఒకరి బాడీకి, మరొకరి తలకాయ కలిపి ఎడిట్ చేశారని, దానిని ఎడిట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో వదిలారని నాని తెలిపారు. పోర్న్ వీడియోలను అడ్డంపెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో చంద్రబాబు, లోకేష్ లపై ప్రచారం జరిగిందని, దానిని పక్కదోవ పట్టించడానికి మాధవ్ వీడియోను ఎడిట్ చేసి బయటకు వదిలారని కొడాలి నాని అన్నారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు మానసిక ఆరోగ్య కేంద్రంలో చేరక తప్పదని కొడాలి నాని అన్నారు.
Next Story