Mon Dec 23 2024 15:28:07 GMT+0000 (Coordinated Universal Time)
konathala : నేడు ఆత్మీయ సమావేశం.. కీలక నిర్ణయం
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేడు తన సన్నిహితులతో సమావేశం కానున్నారు.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేడు తన సన్నిహితులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే తన రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించనున్నారు. ఈ సమావేశానికి ఇప్పటికే అనేక మంది పిలుపులు వెళ్లాయి. కొణతాల రామకృష్ణ ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలసి వచ్చారు. దీంతో ఆయన జనసేనలో చేరడం ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నారు.
జనసేనలో చేరేందుకు...
అదే సమయంలో ఈ నెల 27న జనసేనలో కొణతాల రామకృష్ణ చేరనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో తన అభిప్రాయాన్ని తెలపడంతో పాటు సన్నిహితుల అభిప్రాయాలను కూడా కొణతాల సేకరించనున్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగుతారన్న ప్రచారం మాత్రం సాగుతుంది.
Next Story