Sun Mar 16 2025 12:53:53 GMT+0000 (Coordinated Universal Time)
పరిటాల సునీతను అడ్డుకున్న పోలీసులు
మాజీ మంత్రి పరిటాల సునీత ను పోలీసులు అడ్డుకున్నారు. పుట్టపర్తి వెళ్లకుండా రామగిరిలో పోలీసులు అడ్డుకున్నారు

మాజీ మంత్రి పరిటాల సునీత ను పోలీసులు అడ్డుకున్నారు. పుట్టపర్తి వెళ్లకుండా రామగిరిలో పోలీసులు అడ్డుకున్నారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ రైతుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడికి పుట్టపర్తి వెళుతున్నారు. అయితే వీరిని మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిటాల సునీత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పుట్టపర్తి వెళ్లేందుకు....
రైతుసమస్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు వెళుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని సునీత పోలీసులను సూటిగా ప్రశ్నించారు. అయితే పరిటాల శ్రీరామ్, పరిటాల సునీతలు కలసి ఒకే వాహనంలో వెళ్లేందుకు అనుమతిస్తామని, కాన్వాయ్ ను అనుమతించబోమని పోలీసులు తెలిపారు. ఒక వాహనానికే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు.
Next Story