Tue Dec 24 2024 01:22:34 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రివర్గ విస్తరణపై పేర్ని నాని ఏమన్నారంటే?
మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి వర్గ విస్తరణపై సంచలన కామెంట్స్ చేశారు
మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి వర్గ విస్తరణపై సంచలన కామెంట్స్ చేశారు. రేపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష మాత్రమే జరుగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మంత్రి వర్గంలో మార్పు జరిగే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతమున్న క్యాబినెట్ తోనే ఎన్నికలు జరుగుతాయని, ఈ క్యాబినెట్ తోనే ఎన్నికల్లో గెలుస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారంపై నమ్మవద్దని నాని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 175 నియోజకవర్గాల్లో వైసీపీని ఓడిస్తామంటున్న చంద్రబాబు సైకిల్ గుర్తు 175 నియోజకవర్గాల్లో ఉంటుందా? లేదా? అన్నది చెప్పాలన్నారు. వయసు మీద పడే కొద్దీ చంద్రబాబుకు ప్రగల్భాలు ఎక్కువయిపోతున్నాయని అన్నారు.
గడప గడపకు ప్రభుత్వం...
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ సీరియస్గా తీసుకున్నారని, అలాంటిది ఆయనకు వచ్చే నివేదికల ఆధారంగా పనిచేయని వారిపై సీరియస్ కావడం సహజమేనని పేర్ని నాని తెలిపారు. పార్టీ ఇచ్చిన పనిని ఎమ్మెల్యేలు సక్రమంగా చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. తమతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటున్న చంద్రబాబు టచ్లో ఉన్న వారిని తీసుకెళ్లొచ్చు కదా? అని ఎద్దేవా చేశారు. వైనాట్ పులివెందుల అని టీడీపీ వాళ్లు అంటున్నారని, అలా అనేటప్పుడు చంద్రబాబు కాని, పవన్ కల్యాణ్ కానీ పులివెందులలో పోటీ చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన తెలిపారు.
Next Story