Fri Dec 27 2024 19:58:01 GMT+0000 (Coordinated Universal Time)
బాబు బందరు హల్వా మింగేసినట్లు మింగాడు
చంద్రబాబునాయుడు వల్లనే రాజకీయ నాయకులపై నమ్మకం పోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
చంద్రబాబునాయుడు వల్లనే రాజకీయ నాయకులపై నమ్మకం పోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అంత అబద్ధాల కోరు ఇంకొకరు లేరన్నారు. మచిలీపట్నాన్ని మరో హైదరాబాద్గా మారుస్తానని, బందరు పోర్టు నిర్మాణం చేపడతామని ఆరోజు చంద్రబాబు చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్ కంటే మచిలీపట్నం వెళ్లేలా చేస్తానని గతంలో చంద్రబాబు చెెప్పలేదా? అని ప్రశ్నించారు. బందరుకు చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. జగన్ అంటే రాజకీయాల్లో ఒక నమ్మకం కలిగించారన్నారు. జనం కోసం బతికే నేత జగన్ అని పేర్ని నాని అన్నారు. నీ సామాజికవర్గానికి చెందిన వారికి భూములు, ఆస్తులు, ప్రాజెక్టులు కట్టబెట్టడానికే చంద్రబాబు ఐదేళ్ల పాలనసాగించారన్నారు.
నమ్మకం పోయేలా...
కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ బందరు హల్వాలాగా చంద్రబాబు అండ్ కో మింగేశారన్నారు. రాజధానిని లేకుండా చేశారంటున్న చంద్రబాబు ఇక్కడ శాసన రాజధాని ఉంటుందని తమ పార్టీ అధినేత చెప్పలేదా? అని పేర్ని నాని నిలదీశారు. పారదర్శకంగా బటన్ నొక్కి ప్రతి రూపాయి ప్రజల అకౌంట్లోకి వెళితే, చంద్రబాబు నొక్కుడు పచ్చచొక్కాల జేబుల్లోకి వెళ్లిందన్నారు. నీరు - చెట్టు, పనికి ఆహారపథకం మీ పార్టీ నేతలకు ఆహారం కాదా? అని పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని అన్నారు. జగన్ ను క్యాన్సర్ గడ్డ అంటూ విమర్శించారని, ఈయనేం గడ్డ అంటూ ఎద్దేవా చేశారు. ధైర్యముంటే ప్రజలకు ఏంచేశావో చెప్పుకుని ఈసారి అధికారంలోకి రావాలని పేర్ని నాని సవాల్ విసిరారు.
Next Story