Mon Dec 23 2024 07:58:27 GMT+0000 (Coordinated Universal Time)
వీరు అసలు కమ్యునిస్టులేనా?
నిజమైన కమ్యునిస్టులు రాజధానిని సింగపూర్ కావాలని కోరుకోరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు
నిజమైన కమ్యునిస్టులు రాజధానిని సింగపూర్ కావాలని కోరుకోరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కమ్యునిస్టుల్లో కమ్యునిజం లేదని ఆయన అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే కమ్యునిస్టుల లక్ష్యంగా కనిపిస్తుందని అన్నారు. పేదోడికి ఇంటిపట్టా ఇవ్వవద్దని వారు కమ్యునిస్టులమని చెప్పుకుని తిరుగుతున్నారని అన్నారు. నిజమైన కమ్యునిస్టులు పేదల బాగు కోసం పాటుపడతారని అన్నారు. బలం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు పారిపోయారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఏ డ్యాన్స్ చేయడమంటే ఆ డాన్స్ చేసే సీపీఐ రామకృష్ణ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమేంటని పేర్ని నాని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యం గురించి...
ప్రజాస్వామ్యాన్ని గురించి అచ్చెన్నాయుడు, చంద్రబాబులు మాట్లాడతారా? అని పేర్ని నేని ప్రశ్నించారు. రామకృష్ణ, నారాయణ చంద్రబాబుకు అమ్ముడుపోయారన్నారు. సీపీఐ రామకృష్ణ కమ్యునిస్టు సిద్ధాంతాలను పాటిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు సీట్లు పంచుకోవడం ఎందుకు? జగన్ పాలనపై వ్యతిరేకత ఉంటే ధైర్యంగా విడిగా పోటీ చేయవచ్చు కదా? అని ఆయన నిలదీశారు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ప్రజలు తేలుస్తారని అన్నారు. దొంగలందరు కలసి ఒక పందిరి కిందకు వచ్చినంత మాత్రాన వైసీపీ ఏమాత్రం భయపడదన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు నమ్మరని పేర్ని నాని అన్నారు. ఉద్యోగుల జీతాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగ సంఘాలు ఊరుకుంటాయా? అని పేర్ని నాని అన్నారు.
Next Story