Mon Dec 23 2024 01:48:47 GMT+0000 (Coordinated Universal Time)
భద్రాచలంపై పేర్ని ఘాటు వ్యాఖ్యలు
పోలవరం పై తెలంగాణ అధికార పార్టీ నేతలు విషం కక్కుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
పోలవరం పై తెలంగాణ అధికార పార్టీ నేతలు విషం కక్కుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. భద్రాచలంకు సమీపంలోని ఐదు గ్రామాలను తమకివ్వాలని తెలంగాణ మంత్రులు కోరుతున్నారని, తమకు భద్రాచలం అప్పటించాలని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి భద్రాచలంపై ప్రేమ ఉంటే భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలని పేర్ని నాని అన్నారు. యాదాద్రి తరహాలోనే భద్రాచలాన్ని ఎందుకు అభివృద్ధి చేయరు అని పేర్ని నాని ప్రశ్నించారు.
తెలంగాణ నుంచి....
భద్రాచలాన్ని అక్కడి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్ని నాని అన్నారు. ఏపీకి భద్రాచలాన్ని అప్పగిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి అగ్గిరాజేసే ప్రయత్నం కొందరు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ వాళ్లు ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అది తెలుసుకుని వ్యవహరించాలని పేర్ని నాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేతప్ప రాజకీయాల కోసం భద్రాచలాన్ని వాడుకోవద్దని సూచించారు.
Next Story