Fri Dec 27 2024 20:36:50 GMT+0000 (Coordinated Universal Time)
కేఏ పాల్ కూడా 175 సీట్లలో పోటీ చేస్తారు.. బీఆర్ఎస్ పై నాని సెటైర్
మాజీ మంత్రి పేర్ని నాని భారత రాష్ట్ర సమితిపై సెటైర్ వేశారు. కేఏ పాల్ కూడా 175 నియోజకవర్గాల్లో పోటీ చేశారన్నారు
మాజీ మంత్రి పేర్ని నాని భారత రాష్ట్ర సమితిపై సెటైర్ వేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విలేకర్లు అడిగిన ప్రశ్నలకు వ్యంగంగా సమాధానం ఇచ్చారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ పోటీ పడటం ఖాయమని అన్నారు. అదే సమయంలో 175 నియోజకవర్గాల్లో కేఏ పాల్ పార్టీ కూడా పోటీ చేస్తుందని, బీఆర్ఎస్ చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
భయంతోనే...
తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారని పేర్ని నాని అన్నారు. ఈ మంత్రులా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేది అని ఆయన నిలదీశారు. ఏదైనా ఉంటే తెలంగాణలో చూసుకోవాలి కాని, శ్రీశైలంలో విద్యుత్తును దొంగిలించే వాళ్లు రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలు అని, సిగ్గులేకుండా వారే మాట్లాడుతున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు.
- Tags
- perni nani
- brs
Next Story