Mon Dec 23 2024 16:22:29 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వం ఉందా? లేదా?
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. జగన్ పాలనలో పంటలపై పెట్టుబడితో పాటు ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయన్నారు. మూడేళ్లలో ఎకరానికి 12 వేల నుంచి 15 వేలకు పెట్టుబడి ఖర్చు పెరిగిందని సోమిరెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తుఫాను సంభవించినప్పుడు పత్తికి హెక్టారుకు పదిహేను వేలు, వరికి ఇరవై ఐదు వేలు, అరటి పంటకు ముప్పయి వేలు, చెరుకు పంటకు పదిహేను వేలు ఇచ్చి ఆదుకున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం విపత్తు సమయంలో ఆదుకోవాల్సి ఉండగా చేతులెత్తేసిందన్నారు.
వ్యవసాయ రంగాన్ని.....
ఆక్వా, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. వ్యవసాయ శాఖను గతంలో మంత్రిగా ఉన్న కన్న బాబు సగం మూసేస్తే, ఇప్పటి మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పూర్తిగా మూసివేశారని సోమిరెడ్డి ఆరోపించారు. మూడేళ్లలో మైక్రో ఇరిగేషన్ ను కూడా మూసివేందని ఆయన విమర్శలు చేశారు. తిత్లి, హుద్ హుద్ సమయాల్లో చంద్రబాబు దగ్గరుండి పరిస్థితిని చక్కదిద్దితే ఈ ముఖ్యమంత్రి ప్రజలను పట్టించుకోవడం మానేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండి పడ్డారు. అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
Next Story