Mon Dec 15 2025 03:46:49 GMT+0000 (Coordinated Universal Time)
TDP : చీఫ్ సెక్రటరీపై ఫైర్ అయిన సోమిరెడ్డి
జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదని, చీప్ సెక్రటరీ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు

జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదని, చీప్ సెక్రటరీ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ సీఎస్ కూడా ఇలా దిగజారలేదని ఆయన అన్నారు. బాస్ కు గులాంగా మారి దోపిడీకి జీ హుజూర్ అంటున్నారన్నారు. నిజాయితీగా పనిచేసే పంచాయతీ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ కంటే మేలు అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏ రోజైనా సీఎస్ సక్రమంగా విధులు నిర్వర్తించారా? అని ప్రశ్నించారు.
గులాంగిరీ చేస్తూ...
వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలాయన్నారు. శాసనసభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేశారన్నారు. రెవెన్యూ శాఖను భూకుంభకోణాలకు అడ్డాగా మార్చారన్నారు. ప్రజల పాలిట పెనుశాపమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఒక సీఎస్ గా ఎలా అనుమతిస్తారని, ఎవరూ అడగని రీసర్వేని రైతులపై బలవంతంగా ఎలా రుద్దుతారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
Next Story

