Sun Dec 14 2025 23:33:48 GMT+0000 (Coordinated Universal Time)
వాడుకుని వదిలేయడమే జగన్ పని
ఉద్యోగులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ వాడుకుని వదిలేస్తారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

ఉద్యోగులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ వాడుకుని వదిలేస్తారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రతిపక్షాల అక్రమ అరెస్ట్ లకు గౌతం సవాంగ్ ను వాడుకుని, ఇప్పడు అవమానకర రీతిలో బయటకు గెంటేశారని యనమల అన్నారు. అవసరం తీరే వరకూ అన్న అని, అవసరం తీరిన తర్వాత దున్న అన్నట్లు జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. అవసరం తీరిన అధికారులందరినీ తరిమేస్తున్నారని యనమల ఆరోపించారు.
గతంలోనూ ఇంతే...
గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, అజేయ్ కల్లాలను, ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గౌతం సవాంగ్ లను అలాగే పంపించేశారని జగన్ వైఖరిని యనమల ఎండగట్టారు. ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్ వ్యవహారం దుర్మార్గంగా ఉందని చెప్పారు. పోలీసులు ఇప్పటికైనా జగన్ రెడ్డి వ్యవహారశైలిని అర్థం చేసుకుని నడుచుకోవాలని యనమల రామకృష్ణుడు హితవు పలికారు.
Next Story

