Mon Dec 23 2024 12:14:37 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ కోర్టుకు వచ్చిన అవినాశ్ రెడ్డి
మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి
మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో జరిగింది. ఈ విచారణకు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న ఆరుగురు నిందితులను కూడా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.
పులివెందులలో సీబీఐ అధికారులు
సీబీఐ అధికారులు మంగళవారం మధ్యాహ్నం పులివెందుల సివిల్ జడ్జి కోర్టుకు వచ్చారు. కోర్టులో న్యాయాధికారి లేకపోవడంతో కోర్టు అధికారులతో చర్చించారు. అనంతరం జమ్మలమడుగు కోర్టుకు వెళ్లారు. పులివెందుల కోర్టు ఇన్చార్జి న్యాయాధికారిగా జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి ఉండడంతో సీబీఐ అధికారులు మధ్యాహ్నం అక్కడకు వెళ్లారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్పై నమోదైన కేసుకు సంబంధించి ఓ ఫైలును తీసుకెళ్లారని, ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్లోని హైకోర్టును ఆశ్రయించనున్నారని తెలిసింది. వైఎస్ వివేకానందరెడ్డి 15 మార్చి 2019న పులివెందులలోని తన స్వగృహంలో హత్యకు గురయ్యారు. దీనిపై మొదట సిట్ దర్యాప్తు చేపట్టినా.. వివేకా కుమార్తె సునీత అభ్యర్థన మేరకు హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
Next Story