Tue Apr 08 2025 14:23:14 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీకి మరో షాకింగ్ న్యూస్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా
మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రహ్మాన్ వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు

వైసీపీకి రాజీనామాలు చేసే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. రోజుకు ఎవరో ఒకరు, ఎక్కడో ఒకచోట పార్టీ నేతలు వైసీపీని వీడి వెళుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రహ్మాన్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ పాలనలో పూర్తిగా విఫలమయిందని, అందుకే ప్రజలు దూరం పెట్టారని ఆయన అన్నారు.
మైనారిటీల ప్రయోజనాల కోసం...
మైనారిటీల ప్రయోజనాల కోసం కూటమి సర్కార్ ఎంతో పాటుపడుతుందని తెలిపారు. ఎంసెట్ నిర్వహణలో కూడా వైసీపీ విఫలమయిందన్న ఆయన విఫమయిన పాలన చేసిన వైసీపీలో తాను ఉండలేనని తెలిపారు. అందుకే ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. విశాఖలో వైసీపీకి చెందిన ఒక మైనారిటీ నాయకుడు పార్టీని వీడటం ఫ్యాన్ పార్టీకి దెబ్బేనంటున్నారు.
Next Story