Thu Apr 10 2025 08:30:28 GMT+0000 (Coordinated Universal Time)
సీమను 14 జిల్లాలుగా చేయాలి
రాయలసీమను పథ్నాలుగు జిల్లాలుగా విభజించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు

రాయలసీమను పథ్నాలుగు జిల్లాలుగా విభజించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై ఆయన స్పందించారు. సీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు చాలా పెద్దవని చ ెప్పారు. అందు వల్ల ఈ నాలుగు జిల్లాలను పథ్నాలుగు జిల్లాలుగా మార్చాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. దేశంలోని పదమూడు రాష్ట్రాల వైశాల్యం కంటే రాయలసీమ పెద్దదని ఆయన చెప్పారు.
జగన్ ప్రజలకు దూరంగా....
అనంతపురం, కర్నూలు జిల్లాలను ఒక్కోదానిని నాలుగు జిల్లాలుగా చేయాలని కోరారు. కడప, చిత్తూరు జిల్లాలను ఒక్కోదానిని మూడు జిల్లాలుగా విభజించాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిని కూడా జిల్లాగా చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. జగన్ ప్రజలకు దూరంగా పాలన చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Next Story