Wed Jan 01 2025 08:58:22 GMT+0000 (Coordinated Universal Time)
జైలులో ఉంచాలన్నదే జగన్ ప్లాన్
తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, అన్యాయమని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు
తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, అన్యాయమని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. జగన్ పెద్ద అవినీతి స్కిల్ మాస్టర్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ వరసగా కేసులు పెట్టి చంద్రబాబును జైలులోనే ఉంచాలన్న యోచనలో జగన్ ఉన్నారని అన్నారు. ఫైబర్ నెట్ కేసును మళ్లీ తెరపైకి తేవడం ఇందులో భాగంగానే చూడాలన్న ధూళిపాళ్ల నరేంద్ర తెలుగుదేశం పార్టీ హయాంలో కంటే ఫైబర్ నెట్ కనెక్షన్ ధరను వైసీపీ ప్రభుత్వం రెండు వందల రూపాయలు పెంచారని నరేంద్ర ఆరోపించారు.
ఆధారాలేవీ?
పదో తరగతి చదవని వ్యక్తిని కూడా తీసుకు వచ్చి ఫైబర్ నెట్ ఆపరేషన్ల బాధ్యతను అప్పజెప్పారని ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ విషయంలో అవినీతి జరిగిందంటూ కొందరు అధికారుల చేత బలవంతంగా అవాస్తవాు చెప్పించారన్న నరేంద్ర ఈ రోజు వరకూ స్కిల్ డెవలెప్మెంట్ కేసులో చంద్రబాబు, లోకేష్ లకు డబ్బులు చేరినట్లు నిరూపించలేకపోయారన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసుతో పాటు ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ఆరోపణలే తప్ప ఆధారాలతో కేసులు నమోదు చేయలేదని, ఇది కక్ష సాధింపు చర్య మాత్రమేనని ఆయన అన్నారు.
Next Story