Sun Dec 22 2024 19:47:29 GMT+0000 (Coordinated Universal Time)
నేను టీడీపీ అభ్యర్థికి మద్దతివ్వను : మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్
ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు నా మద్దతు ఉపసంహారించుకొంటున్నానని మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ అన్నారు
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు నా మద్దతు ఉపసంహారించుకొంటున్నానని మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ అన్నారు. తనను కత్తి పెట్టి కోసినా తెలుగుదేశం రక్తమేనని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇంటూరి రాజేష్ కి నా మద్దతు ఉంటుందని దివి శివరామ్ తెలిపారు. తన కుటుంబాన్ని ఇంటూరి నాగేశ్వరరావు అవమానించారన్నారు.
తమ కుటుంబాన్ని...
వందేళ్ళ చరిత్ర గలిగిన తమ కుటుంబాన్ని నాగేశ్వరరావు కించపరిచారని దివి శివరామ్ అన్నారు. తనను దూషించిన పరవలేదు కానీ తన కుటుంబాన్ని దూషిస్తే సహించలేను అని అన్నారు. వైసీపీకి ఓటు వేయమనలేనని, అందుకే ఇంటూరి రాజేష్ కి ఓటు వేయమంటున్నానని ఆయన తెలిపారు. తన మీద అభిమానం ఉన్నోళ్లు తన వెంట నడవాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
Next Story