Sat Dec 21 2024 05:01:55 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్
మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు పాలకొండ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ డా చేరారు
అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. ఆయన కొద్దిసేపటి క్రితం పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. ఆయనకు అవనిగడ్డ జనసేన టిక్కెట్ ఇచ్చే అవకాశముంది. దీంతో అవనిగడ్డలోని జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ జనసేనకు కేటాయించడంతో మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరి టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
టీడీపీ నుంచి...
. పాలకొండ, అవనిగడ్డ రెండు స్థానాలకు అభ్యర్థులను ఇప్పటి వరకూ జనసేన ప్రకటించలేదు. ఇప్పుడు మండలి చేరికతో అభ్యర్థులను ఇక ప్రకటించే అవకాశముంది. మండలి బుద్ధప్రసాద్ కే జనసేన అభ్యర్లిగా ప్రకటించే అవకాశాలున్నాయి. అందుకోసమే ఆయన జనసేనలో చేరారని అంటున్నారు. పిఠాపరంలో పవన్ కల్యాణ్ మండలి బుద్ధప్రసాద్ ను పవన్ కల్యాణ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Next Story