Mon Dec 23 2024 09:03:46 GMT+0000 (Coordinated Universal Time)
కేశినేని కామెంట్స్ పై బుద్దా వెంకన్న ఏమన్నారంటే?
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తనను ఉద్దేశించి కేశినేని నాని కామెంట్స్ చేశారని తాను అనుకోవడం లేదని తెలిపారు. ఎవరి గురించి మాట్లాడారో ఆయనే చెప్పాలన్నారు. తనను పేరు పెట్టి అంటే అందుకు స్పందిస్తానని బుద్దా వెంకన్న తెలిపారు.
అంగీకరిస్తున్నా...
కేశినేని నాని వ్యాఖ్యల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయని బుద్దా వెంకన్న అంగీకరించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తమకు, కేశినేని నానికి మధ్య విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. అయితే అవి విభేదాలు మాత్రమేనని కక్షలు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాను మిస్టర్ క్లీన్ గా ఉన్నప్పుడు తనను అన్నారని తాను అనుకోవడం లేదని బుద్దా వెంకన్న మీడియాకు చెప్పుకొచ్చారు
Next Story