Mon Apr 07 2025 23:20:13 GMT+0000 (Coordinated Universal Time)
అన్ని స్థానాల్లో పోటీ చేసినా టీడీపీ గెలిచేది
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేసినా గెలిచేదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసినా గెలిచేదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి జగన్ కారణమని తెలిపారు. జగన్ పొగరే ఆయన పతనానికి దారితీస్తుందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జగన్ వల్లనే వైసీపీ ఓటమి పాలయిందని, రానున్న ఎన్నికల్లో కూడా ఓటమి ఖాయమని హర్షకుమార్ తెలిపారు.
జగన్ అసంతృప్తితో...
వైసీపీ ఎమ్మెల్యేలలో చాలా మంది జగన్ పై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ దత్తపుత్రుడని హర్షకుమార్ అన్నారు. దత్తపుత్రుడుగా ఉన్న జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు వెళ్లకుండా మోదీ చేశారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం తాగేవాళ్లంతా జగన్ ను తిట్టుకుంటున్నారని చెప్పారు. దళతులను హత్య చేసిన వాళ్లను అరెస్ట్ కూడా చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వారందరిపై కేసులు పెడుతున్నారన్నారు.
Next Story