Tue Apr 01 2025 02:35:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కేసీఆర్ తో ఉండవల్లి భేటీ
ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. రేపో, మాపో పార్టీ ప్రకటన కూడా ఉంటుంది.
జాతీయ పార్టీపై...
అయితే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీ పై చర్చించేందుకు ఉండవల్లిని ప్రత్యేకంగా కేసీఆర్ పిలిపించుకున్నట్లు సమాచారం. కొత్త పార్టీ పెడితే ఎటువంటి పరిణామలు చోటు చేసుకుంటాయి? దేశ స్థాయిలో కలసి వచ్చే పార్టీలేంటి అన్న దానిపై వీరిద్దరూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కొంత రాజకీయ అవగాహన ఉన్న ఉండవల్లితో కేసీఆర్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ రెండు సార్లు మాత్రమే లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు.
Next Story