Sun Dec 22 2024 19:38:29 GMT+0000 (Coordinated Universal Time)
Pithapuram : తనపై జనసేన కార్యకర్తలు దాడి చేశారంటున్న పిఠాపురం వర్మ
తనపై జనసేన కార్యకర్తలు కొందరు దాడి చేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎన్ వర్మ అన్నారు.
తనపై జనసేన కార్యకర్తలు కొందరు దాడి చేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎన్ వర్మ అన్నారు. 2009 కు ముందు జనసైనికులు వేరని, ఇప్పటి జనసైనికులు వేరని ఆయన అన్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేరు చెప్పుకుని తిరుగుతున్న కొందరు జనసేన కార్యకర్తలు తమపై దాడికి దిగారన్నారు. తాము ఎనిమిది నెలల నుంచి వీరితో బాధపడుతున్నామని వర్మ తెలిపారు.
పవన్ విజయం కోసం...
అయినా బాధ దిగమింగుకుని తాను, తన మద్దతుదారులు పవన్ కల్యాణ్ విజయం కోసం కృషి చేశామని ఎన్విఎస్ఎన్ వర్మ చెప్పుకొచ్చారు. ఈ దాడిలో తనతో పాటు తన వెంట ఉన్న వారికి కూడా గాయాలయ్యాయన్నారు. బాటిల్స్, రాళ్లతో తనపై దాడికి దిగారన్నారు. తనకు కూడా గాయాలన్న ఎన్విఎస్ఎన్ వర్మ దీనిపై తమ వారితో సంప్రదించి పోలీసు కేసు పెడతానని తెలిపారు.
Next Story