Fri Apr 11 2025 22:11:41 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : నేడు జనసేనలోకి మాజీ వైసీపీ నేత
నేడు జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేరనున్నారు.

నేడు జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేరనున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన పెండెం దొరబాబు మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో ఆయన మౌనంగా ఉన్నారు. అయితే పరోక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపునకు కృషి చేశారని చెబుతారు. ఎన్నికల ఫలితాలు వచ్చినతర్వాత ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.
వైసీపీకి రాజీనామా చేసి...
ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసిన పెండెం దొరబాబు తన చేరికపై క్లారిటీ తీసుకున్నారు. తనతో పాటు వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలతో కలసి ఆయన నేడు జనసేన పార్టీలో చేరనున్నారు. పెండెం దొరబాబును నేడు పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించనున్నారు. దీంతో పిఠాపురంలో జనసేన మరింత బలోపేతం అయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Next Story