Mon Dec 23 2024 13:39:18 GMT+0000 (Coordinated Universal Time)
సోము పై కన్నా ఫైర్.. అంతా ఆయన వల్లనే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని ఆయన అన్నారు. పవన్ తో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విషయం విఫలమయిందన్నారు. దీంతో బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి.
పవన్ దూరం కావడానికి...
సోము వీర్రాజు ఒక్కడే చూసుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తాయని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. తమ పార్టీలో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియడం లేదన్నారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే అని ఆయన అన్నారు. పార్టీ బలోపేతం కోసం హైకమాండ్ పనిచేయాలని ఆయన కోరారు. బీజేపీ నుంచి పవన్ కల్యాణ్ దూరమయితే మాత్రం దానికి కారణం సోము వీర్రాజు కారణమవుతాడని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story