Sat Dec 21 2024 18:56:34 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడ నుంచి పోటీకి దిగుతా
విజయవాడ నుంచి తాను పోటీ చేస్తానని మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తెలిపారు
విజయవాడ నుంచి తాను పోటీ చేస్తానని మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తెలిపారు. పార్టీ ఆదేశిస్తే విజయవాడ పార్లమెంటు నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్నానని తెలిపారు. పొత్తులపై త్వరలోనే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సుజనా చౌదరి చెప్పారు. విజయవాడ నుంచి పోటీ చేస్తే బీజేపీ విజయం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజ్యసభ ఎన్నికలపై...
ఎవరు ఏమనుకున్నా ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సముఖంగా ఉందని తెలిపారు. రాజ్యసభ ఎన్నికలపై బీజేపీ ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. ఏపీలో ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరుగుతాయని, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం మంచి పరిణామమని సుజనా చౌదరి తెలిపారు.
Next Story