Sun Dec 22 2024 12:49:37 GMT+0000 (Coordinated Universal Time)
మేం టీడీపీ వెంట పడటం లేదు
తాము పొత్తుల కోసం తెలుగుదేశం పార్టీ వెంటపడటం లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు
తాము పొత్తుల కోసం తెలుగుదేశం పార్టీ వెంటపడటం లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. తమకుక మద్దతు ఇవ్వాలని ఎవరినీ అడగటం లేదని ఆయన తెలిపారు. జనసేన పార్టీ తమతో పొత్తులో ఉందని, బీజేపీతో అది కొనసాగుతుందని తాము భావిస్తున్నామని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఏపీలో బీజేపీ ప్రతి స్థానంలో పోటీ చేసి అధికారంలోకి రావాలని కోరుకుంటుందన్నారు.
బలోపేతానికి కార్యాచరణ...
కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 19వ తేదీ నుంచి అక్టోబరు 2 వ తేదీ వరకూ జిల్లాల్లో బీజేపీ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందించుకున్నామని ఆయన చెప్పారు. అయితే ఈసారి ఏపీలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందన్న చర్చ రాజకీయ పార్టీల్లోననూ, ప్రజల్లోనూ జరుగుతుందన్నారు.
Next Story