Tue Apr 22 2025 10:07:49 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సీఐడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి
నేడు విజయవాడ సీఐడీ ఆఫీస్కు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రానున్నారు

నేడు విజయవాడ సీఐడీ ఆఫీస్కు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రానున్నారు. ఆయనను విచారణకు రావాల్సిందిగా సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీకేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పోలీసులు విజయసాయిరెడ్డిని ఈ కేసులో విచారించాలని పిలిచారు. కాకినాడ పోర్టులో వాటాలను బెదిరించి తీసుకున్నారంటూ కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిపై కేసు నమోదు అయింది.
కాకినాడ పోర్టు లో వాటాలను...
ఈరోజు ఉదయం పదకొండు గంటలకు విచారణకు విజయసాయి హాజరుకావాల్సి ఉంది. ఇదే కేసులో గతంలో ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి తనకు సంబంధం లేని తెలిపారు. అయితే ఈరోజు సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి వస్తారా? రారా? అన్న సమాచారం మాత్రం ఇంకా పోలీసులకు చేరలేదు. విచారణకు హాజరవుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Next Story