Tue Apr 01 2025 11:17:41 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ జగన్ కు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విలువలు, విశ్వసనీయతలు రాజ్యసభ సభ్యులకు అవసరమన్నారు. విజయసాయిరెడ్డికి కూడా అదే వర్తిస్తుందన్నారు. ప్రలోభాలకు, బెదిరింపులకు ఎవరూ గురయినా అది నాయకత్వం అనిపించుకోదని జగన్ చేసిన వ్యాఖ్యలు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చేసినవే.
ఏమన్నారంటే?
దీనికి విజయసాయిరెడ్డి ఈరోజు ఎక్స్ లో సమాధానమిచ్చారు. "వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా" నంటూ ఆయన ట్వీట్ చేశారు.
Next Story