Mon Dec 23 2024 00:53:12 GMT+0000 (Coordinated Universal Time)
జేసీ ప్రభాకర్ రెడ్డి బంపర్ ఆఫర్
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాడిపత్రి అభివృద్ధే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. పెద్దవడుగూరు టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. 'తాడిపత్రి అభివృద్ధికి రానున్న మూడు నెలల్లో బ్యాంకులో మూడు కోట్ల రూపాయలు, వచ్చే ఏడాది డిసెంబరు 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తానని తెలిపారు.
సొంత డబ్బులతో...
తన సొంత డబ్బులు చూపిస్తానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాడిపత్రిలో ఎవరు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చని బిగ్ ఆఫర్ ఇచ్చారు. వారికి తాను ఆర్థికంగా అండగా ఉంటానని తెలిపారు. ఆ వ్యాపారంలో తానే 20 శాతం పెట్టుబడి పెడతానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.. వ్యాపారులు 15 శాతం ఇస్తే మరో 15 శాతం తన డబ్బులు వేసి అభివృద్ధికి ఖర్చు పెడతానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించడం సంచలనమే అయింది.
Next Story